బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

పెర్కిట్‌లో విషాదం.. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఉరివేసుకుని మృతి…

ఆర్మూర్, జూలై 23 (విజయభారతి):

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. పెద్దకాపు రవీందర్ రెడ్డి (35) తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందాడు.
స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రవీందర్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత ఆరు నెలలుగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుండగా, ఇటీవల ఆదివారం ఇంటికి వచ్చాడు.గురువారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు తిరిగి ఇంటికి చేరుకోగా రవీందర్ రెడ్డి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. వెంటనే స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
మృతుడు రవీందర్ రెడ్డికి భార్య, ఓ కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో పెర్కిట్ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…