బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

కన్నడ నటి శోభిత ఆత్మహత్య కేసుపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్న గచ్చిబౌలి పోలీసుల

కన్నడ నటి శోభిత ఆత్మహత్య కేసుపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్న గచ్చిబౌలి పోలీసుల

శేరిలింగంపల్లి గచ్చిబౌలి విజయభారతి న్యూస్ ; కన్నడ సీరియల్ నటి
శోభిత (32) ఆత్మహత్య కేసు పై గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆదివారం రోజు మధ్యాహ్నం శోభిత తన బెడ్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె మృతి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త సుధీర్ రెడ్డితో పాటు చుట్టుపక్కల ఉన్న వారిని కూడా విచారించారు. ఇప్పటి వరకు భార్య భర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయినట్లు తెలుస్తుంది. అయితే నటి శోభిత డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకుందా లేక ఇతర కారణాలతో చనిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు శోభిత భర్త సుధీర్ రెడ్డితో పాటు ఇంటి చుట్టుపక్కల వాళ్ళ స్టేట్మెంట్లను సైతం రికార్డు చేశారు. శోభిత ఆత్మహత్యకు ముందు ఎవరెవరితో మాట్లాడింది అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శోభిత మృతి విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కర్ణాటక నుండి బయలుదేరి వచ్చారు. ఆమె మృతిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. చేశారు. మ్యాట్రిమోనిలో శోభిత ప్రొఫైల్ చూసి సుధీర్ రెడ్డి ఆమెకు మ్యారేజ్ ప్రపోజల్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సుధీర్ రెడ్డిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత శోభిత నటనకు దూరంగా ఉంటుందని అన్నారు. శోభిత మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…