Breaking News

దర్జాగా రోడ్డు కబ్జా

పిర్యాదులు చేసిన పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు !

శేరిలింగంపల్లి చంధానగర్ విజయ భారతి న్యూస్ ; శేరిలింగంపల్లి చందానగర్ డివిజన్ పరిధిలో ఉన్న మదీనాగుడా జాతీయ రహదారి కి ఆనుకొని ఉన్న 450 గజాల రోడ్డు సుమారు 10 కోట్ల రూపాయల స్థలాన్ని ఓ అక్రమార్కుడు దర్జాగా కబ్జా చేశాడు. రెండు నెలల క్రితం అదే స్థలం పక్కన కార్ మెకానిక్ షెడ్ ను రోడ్డు కబ్జా చేశాడని చందానగర్ సర్కిల్ 21 టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఇప్పుడు ఆ స్థలం పక్కనే జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సబ్ రొడ్డును కబ్జా చేసి ప్రహరీ గోడను నిర్మించిన అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు అంటున్నారు. కబ్జా చేసిన వ్యక్తిని స్థానికులు వెళ్లి నిలదీయగా నేను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డితో అన్ని విషయాలు మాట్లాడుకొని ప్రహరీ నిర్మించడానికి అనుమతులు తీసుకున్నానని నన్ను ఎవరు ఏమి చేయలేరని ఏ ఒక్క అధికారి కూడా నా దగ్గరికి రాడని స్థానికులపై కబ్జాదారుడు మండిపడుతున్నాడు.

ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్ గుంత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *