Breaking News

నేటి నుండి టెట్ కు దరఖాస్తుల ప్రక్రియ….

(విజయభారతి న్యూస్ ):జులై 22

మరోసారి మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ…

సర్కార్ బడుల్లో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యా యుల కోసం ప్రత్యేకంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేష న్ మంగళవారం రిలీజ్ అయింది,దీనికి సంబంధించి బుధవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది ఈ నెల 29 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించా రు ఈ వివరాలను ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలాస్,టెట్ కన్వీనర్ జి రమేష్, వెల్లడించారు.ఈ టెట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో CBT మొత్తం రెండు పేపర్లుగా నిర్వహిస్తా రు. 1 నుండి 5 తరగ తులకు బోధించే SGTలు & LFL హెచ్‌ఎంలు పేపర్-I రాయవలసి ఉండగా.. 6 నుండి 8 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్లు, TGTలు, లాంగ్వేజ్ పండిట్లు, హైస్కూల్ హెచ్‌ఎం లు పేపర్-II పరీక్ష రాయాలి. ఈ పరీక్ష లో ప్రతి పేపర్ 150 మార్కులకు 150 బహుళ ఐచ్ఛిక ప్రశ్నల ఎం సి క్యూ రూపంలో ఉంటుంది.అయితే ఇందులో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. జనరల్, బీసీ కేటగిరీ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.750/-, రెండు పేపర్లకు రూ.1000/- రుసుము నిర్ణయించ గా.. SC/ST/ పిడబ్ల్యుడి అభ్యర్థు లకు ఒక పేపర్‌కు రూ.700/-, రెండు పేపర్లకు రూ.950/- గా నిర్ణయించారు.పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి జనరల్ ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు 60% అంతకంటే ఎక్కువ, బీసీ అభ్యర్థులకు 50% అంతకంటే ఎక్కువ, SC/ST/వికలాంగ అభ్యర్థులకు 40% అంతకంటే ఎక్కువ మార్కులు రావలసి ఉంటుంది.అర్హత కలిగిన ఉపాధ్యాయులు 2026 జులై 22 నుండి జులై 29 వరకు విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖా స్తులు సమర్పించ వచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థు లు 2026 ఆగస్టు 31 నుండి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.పరీక్షలు సెప్టెంబర్ 07 నుండి సెప్టెంబర్ 11 వరకు రోజుకు రెండు విడతల్లో ఉదయం 9.00 నుండి 11.30 వరకు, మధ్యాహ్నం 2.00 నుండి 4.30 వరకు) నిర్వహిస్తారు. 2026 సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 30 మధ్య ప్రకటిస్తారు. దరఖాస్తు సమయం లో ఎలాంటి సందేహా లు ఉన్నా నివృత్తి చేసుకోవడానికి విద్యాశాఖ హెల్ప్‌ డెస్క్ ఫోన్ నంబర్లు 7093958881 అందుబాటులో ఉంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *